BREAKING : మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు. విశాఖలో…. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు. ఈ మేరకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు నోటీసులు ఇచ్చారు దిశా ఏసీపీ వివేకానంద. గంటాను ఇంటి నుంచి బలవంతంగా తరలించిన పోలీసులు…విజయవాడకు తరలించనున్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి గంటా మాట్లాడుతూ… అమరావతి భూముల కేసులో నా పేరు చేర్చారని ఫైర్ అయ్యారు. ఎన్ని విచారణలు జరిగిన నా ప్రస్తావన రాలేదని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి హీట్ తగలడంతో నన్ను తెరపైకి తెచ్చారని ఆగ్రహించారు. ఏ కేసులకైనా నేను సిద్ధం….ఎదుర్కొవడానికి రెడీగా వున్నాను…చంద్రబాబు అరెస్ట్ హేయమైన చర్య అన్నారు. అర్ధరాత్రి హైడ్రామా చేయాలిసిన అవసరం లేదని చురకలు అంటించారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.