BRSను ఓడించడానికి పదేళ్లు పట్టింది.. కాంగ్రెస్ కు అంత టైం అవసరం లేదు : ప్రధాని మోదీ

-

తెలంగాణ రాజకీయాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్  ప్రభుత్వాల మధ్య తేడాను తెలంగాణ ప్రజలూ గుర్తించలేకపోతున్నారని అన్నారు. ఒకే నాణేనికున్న రెండు పార్శ్వాలు బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు అని పేర్కొన్నారు. రెండు ప్రభుత్వాలు కొండంత హామీలిచ్చి.. గోరంతే చేశాయని.. చేస్తున్నాయని మండిపడ్డారు. కానీ అవినీతి విషయంలో మాత్రం రెండు పార్టీలు ఒకే రకంగా ఉన్నాయని విమర్శించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

“తెలుగు సినిమా పరిశ్రమ ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి సూపర్‌హిట్‌ సినిమాను ఇస్తే.. తెలంగాణ ప్రభుత్వం ప్రజల నుంచి బలవంతంగా ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దేశానికి మంచిపేరు తెస్తే, ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ భారత్‌ పరువును దిగజారుస్తోంది. దిల్లీ మద్యం కుంభకోణంలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ లు రెండూ భాగస్వాములే. బీఆర్ఎస్ ను ఇంటికి పంపడానికి ప్రజలు పదేళ్లు తీసుకున్నారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని సాగనంపడానికి వారికి ఎక్కువ సమయం పట్టదు.” అని ప్రధాని మోదీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version