ప్రధాని మోడీ రాజీనామా చేసి క్షమాపణలు చెప్పాలి – కేఏ పాల్

-

ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఆదివారం మేడ్చల్ జిల్లాలో మణిపూర్ ఘటనకు నిరసనగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కేఏ పాల్ మాట్లాడుతూ.. బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే ఆ ఘటనల వెరకాల నరేంద్ర మోడీ ఉన్నారని అర్థం అవుతుందన్నారు.

ఇక బిజెపి – బీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్స్ అయిందని.. ఆ కారణంగానే మణిపూర్ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించడం లేదని అన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు కాబోతుందని తెలిసి బిఆర్ఎస్, బిజెపితో రహస్య ఒప్పందం చేసుకుందన్నారు. బిజెపి బీ టీం గా బీఆర్ఎస్ వ్యవహరిస్తుంటే.. బీఆర్ఎస్ కి బీ టీం గా కాంగ్రెస్ పని చేస్తుందని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలను రక్షించుకోవాలంటే ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రావాలన్నారు కేఏ పాల్.

Read more RELATED
Recommended to you

Exit mobile version