బీఆర్ఎస్ పార్టీ నుంచి కే.కేశవరావు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మీ, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, కడియం శ్రీహరి, కడియం కావ్య వంటి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజా రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. మరోవైపు పట్నం మహేందర్ రెడ్డి, సునితారెడ్డి, చేవెళ్ల ఎంపీ డా.రంజీత్ రెడ్డి ఇలా చాలా మంది నేతలు కాంగ్రెస్ లో చేరి ఎంపీలుగా పోటీ చేయనున్నారు.
ఈ నేపథ్యంతో తాజాగా మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి చెత్త అంతా పోయిందని.. గట్టి వాళ్లే మిగిలారన్నారు. తొలి నుంచి గులాబీ జెండా మోసిన నాయకులే పార్టీలో ఉన్నారన్నారు. పదవులు, వ్యాపారాల కోసం వచ్చిన వారే పార్టీ మారుతున్నారన్నారు. ఎంపీ ఎన్నికల తర్వాత బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయన్నారు. మోస కారుల జాబితా రాస్తే తొలి పేరు బీబీ పాటిల్ దే ఉంటుందని పోచారం ఫైర్ అయ్యారు. నాయకులను కొటారు గానీ కార్యకర్తలను కొనలేరన్నారు.