పోలీసులు వర్సెస్ బెటాలియన్ కానిస్టేబుళ్లు..సచివాలం వద్ద ఉద్రిక్తత…!

-

సచివాలం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు వర్సెస్ బెటాలియన్ కానిస్టేబుళ్లు మధ్య వార్‌ కొనసాగుతోంది. పోలీసులకు బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సచివాలం ముట్టడికి వచ్చిన బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు.. దీంతో వారితో గొడవపడుతున్నారు ఆందోళన కారులు.


ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంత చెండాలపు ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదంటూ బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. కష్టపడి చదువుకున్న కానిస్టేబుళ్లతో కూలీ పనులు చేపించుకుంటున్నారని ఫైర్‌ అయ్యారు. పై అధికారులు మందు కలిపించుకుంటున్నారని ఆరోపణలు చేశారు. దీనిపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. పోలీసుల భార్యలను మహిళా కానిస్టేబుళ్లు కొట్టుకుంటూ తీసుకుపోతున్నారు….సీఎం రేవంత్ రెడ్డికి పోలీస్ శాఖ మీద ఏ మాత్రం శ్రద్ధ లేదని ఆగ్రహించారు. రేవంత్ రెడ్డికి రక్షణ కల్పించే పోలీస్ శాఖ వారికి సమస్యలు ఉంటే పరిష్కరించడానికి అవ్వడం లేదని… ఏక్ పోలీస్ విధానం మీద రేవంత్ రెడ్డి త్వరగా ఆక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా అంటూ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version