పొంగులేటి-జూపల్లి ఫిక్స్..కాంగ్రెస్‌కు కలిసొచ్చేది ఎంత?

-

మొత్తానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ లో చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఇన్ని రోజుల పాటు పార్టీ చేరికల విషయంలో కాస్త క్లారిటీ లేకుండా సస్పెన్స్ లో పెడుతూ వచ్చిన ఈ ఇద్దరు నేతలు..కాంగ్రెస్ లో చేరేది ఎప్పుడో తేల్చేశారు. బి‌ఆర్‌ఎస్ నుంచి బయటకొచ్చిన ఈ ఇద్దరితో బి‌జే‌పిలోకి తీసుకెళ్లడానికి ఈటల రాజేందర్ చర్చలు చేశారు.

కానీ వారు బి‌జే‌పిలో చేరడానికి ఆసక్తి చూపలేదు. అదే సమయంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడారు. ఇక కర్నాటకలో కాంగ్రెస్ గెలవడం, రాష్ట్రంలో బి‌జే‌పి కంటే కాంగ్రెస్ ఎక్కువ బలంగా ఉండటంతో ఇద్దరు నేతలు కాంగ్రెస్ వైపు రావడానికి ఆసక్తి చూపారు. కానీ ఎప్పుడు జాయిన్ అవుతారో క్లారిటీ ఇవ్వలేదు. ఇదే క్రమంలో తాజాగా వారు క్లారిటీ ఇచ్చేశారు. మొదట టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యి, ఆ తర్వాత ఈ నెల 25న ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీతో మాట్లాడనున్నారు. అక్కడే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు.

ఇక జూలై 2న ఖమ్మంలో భారీ సభ పెట్టి రాహుల్ గాంధీ చేత కాంగ్రెస్ కండువా కప్పించుకుంటారు. వీరితో పాటు ఇద్దరు ఎమ్మెల్సీలు, పలువురు బి‌ఆర్‌ఎస్ నేతలు సైతం కాంగ్రెస్ లో చేరతారని తెలిసింది. సరే పొంగులేటి, జూపల్లి ఇన్ని రోజులు హడావిడి చేసి కాంగ్రెస్ లో చేరుతున్నారు. మరి వీరి వల్ల కాంగ్రెస్‌కు ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? అంటే కొంతమేర ఉంటుందనే చెప్పాలి.

ఖమ్మంలో పొంగులేటికి కాస్త బలం ఉంది..ప్రతి స్థానంలో గెలిచే బలం లేదు..కాకపోతే ప్రభావం చూపగలరు. పొంగులేటి…కాంగ్రెస్ తో కలిస్తే బలం పెరుగుతుంది. అటు జూపల్లికి కొల్లాపూర్ తో పాటు వనపర్తి లాంటి స్థానంలో పట్టు ఉంది. ఆ స్థానాల్లో కాంగ్రెస్‌కు కాస్త బలం వస్తుంది. ఈ చేరికల వల్ల కాంగ్రెస్ పార్టీకి కాస్త బలం పెరుగుతుందనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version