రేషన్ కార్డు ఉన్నవారు ఆరు గ్యారెంటీల కోసం ఈనెల 28 నుంచి దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పొంగులేటి ప్రకటించారు. కానీ చాలామంది రేషన్ కార్డు లేకపోవడంతో గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకోలేమని వాపోతున్నారు.
అయితే కొత్త కార్డులు జారీ చేసి, గ్యారెంటీలను అమలు చేయడానికి సమయం పడుతుందనే, ఇప్పటికే ఉన్నవారికి అవకాశం కల్పించినట్లు ప్రభుత్వం చెబుతోంది. కొత్తవి జారీ చేసిన తర్వాత వారికి దరఖాస్తుకు అవకాశం కల్పిస్తామంటుంది.
కాగా,తెలంగాణలో ఈ నెల 28వ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజా పాలన కొనసాగునున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 22.93 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం రోజున ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ గ్రామ పంచాయతీకి రూ.10 వేల చొప్పున మొత్తం 12,769 గ్రామ పంచాయతీలకు రూ. 12.77 కోట్లు, పురపాలక సంఘాల్లోని ఒక్కో వార్డుకు రూ. 10వేల చొప్పున 3,658 వార్డులకు రూ. 3.66 కోట్లు విడుదల చేయనుంది.