బండి సంజయ్ రోజు నాన్ వెజ్ తింటాడు, మందు తాగుతాడు – పొన్నం

-

బండి సంజయ్ రోజు నాన్ వెజ్ తింటాడు, మందు తాగుతాడంటూ సంచలన ఆరోపణలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. నేను వెజిటేరియన్.. బండి సంజయ్ రోజు నాన్ వెజ్ తింటాడు, మందు తాగుతాడన్నారు. నువ్వు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయావ్.. నీకంటే ముందే నేను ఎంపీ అయ్యానని గుర్తు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్.

ponnam comments on bandi

రాముడి గురించి నేను అనని మాటలు అన్నట్టు సంజయ్ చెబుతున్నారు.. ఆధారాలు చూపిస్తే సజీవదహనం చేసుకుంటానని సవాల్‌ చేశారు పొన్నం. రాముని అక్షింతల గురించి నేను మాట్లాడితే పత్రికలు రాయకపోయేవా..? అంటూ నిలదీశారు. బతికి ఉన్న నా తల్లిని ఆత్మ క్షోభిస్తుంది అన్నావు… తల్లి ఎవరైనా తల్లే… తల్లి గురించి తప్పుడు మాటలు మాట్లాడి అనలేదు అంటావా సంజయ్? అంటూ మండిపడ్డారు.మూడు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన నువ్వు రాజకీయ సన్యాసం గురించి మాట్లాడతావా? అంటూ నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version