రైతు బాగుంటేనే ఆంధ్ర ప్రదేశ్ బాగుంటుందన్నారు సీఎం జగన్. రైతన్నలకు పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదని కొనియాడారు సీఎం జగన్. “వైఎస్సార్ రైతు భరోసా” నిధులు విడుదల చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ…నేడు వరుసగా ఐదో ఏడాది.. ఈ ఏడాదికి మూడో విడతగా.. “వైఎస్సార్ రైతు భరోసా” విడుదల చేశామని… ఒక్కొక్కరికి మరో రూ. 2,000 చొప్పున 53.58 లక్షల మంది రైతన్న ఖాతాల్లో రూ. 1,078.36 కోట్లు నేడు జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు సీఎం జగన్.
ఇప్పుడు అందిస్తున్న సాయం రూ.1,078.36 కోట్లతో కలిపి ఈ 57 నెలల్లో రైతన్నలకు మన ప్రభుత్వం అందించిన మొత్తంలో కేవలం “వైఎస్సార్ రైతు భరోసా సాయం రూ.34,288 కోట్లు అన్నారు సీఎం జగన్. నేడు వరుసగా నాలుగో ఏడాది “వైఎస్సార్ సున్నా వడ్డీ పంటరుణాలు” విడుదల చేశామని వివరించారు. రబీ 2021-22, ఖరీఫ్ 2022 లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 10,78,615 మంది రైతన్నలకు రూ.215.98 కోట్ల వడ్డీ రాయితీ సొమ్ము ను నేడు వారి ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు సీఎం జగన్.