నేనేం అలుగలేదు…ఊరికే అక్కడ కూర్చున్నా – పొన్నం ప్రభాకర్

-

నేనేం అలుగలేదు…ఊరికే కూర్చున్నా అంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మహిళలు వెళ్లే సమయంలో తోపులాట జరిగిందని… మేయర్ కూడా తోపులాటలో ఇబ్బంది పడ్డారని వివరించారు. హైదరాబాద్‌ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం కన్నుల పండువగా జరుగుతోంది. ఇక అమ్మవారి కల్యాణ మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండాసురేఖ పాల్గొన్నారు.

ఈ ఇద్దరు మంత్రులు తమ భాగస్వాములతో కలిసి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అయితే కల్యాణం సమయంలో మంత్రి పొన్నం, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అలకబూనారు. అయితే.. దీనిపై పొన్నం మాట్లాడుతూ.. తోపులాట నిలువరించేందుకు కొద్ది సేపు ఆగి అధికారులతో మాట్లాడామన్నారు. తోపులాట జరుగుతుంటే ఏం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించాము..అమ్మవారి భక్తులం ఎందుకు అలుగుతామని పేర్కొన్నారు. మహిళా రిపోర్టర్ కు ఎదురైన చేదు అనుభవానికి క్షమాపణ చెబుతున్నామని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version