దయచేసి కేసీఆర్ ప్రస్తావన వద్దు.. సభలో హరీశ్ రావుకు పొన్నం వినతి

-

దేశానికి దిశానిర్దేశం చేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. నిరుపేద కుటుంబాల్లో పుట్టి అనూహ్యంగా ఎదిగారన్నారు. అసెంబ్లీలో మన్మోహన్ సింగ్ సంతాప తీర్మాణం సందర్భంగా మాట్లాడారు హరీశ్ రావు. కేసీఆర్ నాయకత్వంలో పీవీకి భారతరత్న ఇవ్వాలని ఇదే అసెంబ్లీలో తీర్మాణం చేశామని.. కేంద్ర కూడా స్పందించి పీవీకి భారతరత్న ఇచ్చింది. హైదరాబాద్ లో కేసీఆర్ పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

ఆయనను మా పీవీగా, టీవీగా గౌరవించామని తెలిపారు. కాంగ్రెస్ ఓటమికి సంస్కరణలే కారణమని ఏఐసీసీలో చర్చించినా మన్మోహన్ తెచ్చిన ఆర్డినెన్స్ ను రాహుల్ చించేసినా ప్రధానిగా ఆయన మాట్లాడలేదని తెలిపారు. దాదాపు రెండేళ్ల పాటు కేంద్ర మంత్రి వర్గంలో కేసీఆర్ పని చేశారని గుర్తు చేశారు. 2004లో కేంద్ర మంత్రివర్గంలోకి వచ్చిన తరువాత తెలంగాణ ఉద్యమానికి ఎన్నోసార్లు ఎదురుదెబ్బలు తగిలినా అధైర్య పడొద్దని ప్రోత్సహించారన్నారు. కేంద్ర కేబినెట్ లో చేరాలని కేసీఆర్ ను మన్మోహన్ సింగ్ ఆహ్వానించారన్నారు. అయితే అసెంబ్లీలో హరీశ్ రావు మాటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కేసీఆర్ అంటే గౌరవం కాదనడం లేదు.. కేసీఆర్ గురించి ఎందుకు అధ్యక్ష అని తెలిపారు మంత్రి పొన్నం.

Read more RELATED
Recommended to you

Exit mobile version