తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారన్న సంగతి తెలిసిందే.ఈ తరుణంలో తెలంగాణ బిడ్డల ప్రాణాలు బలితీసుకున్న కాంగ్రెస్ నాయకులకు స్వాగతం అంటూ వెలిశాయి బ్యానర్లు. ఎయిర్పోర్ట్ సమీపంలో రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతూ బ్యానర్లు వెలిశాయి.
కాగా, ఇవాళ రాహుల్ గాంధీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక, వరంగల్ జిల్లా నర్సంపేట, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఆ నియోజకవర్గాల్లో నిర్వహించనున్న కాంగ్రెస్ విజయభేరీ సభల్లో పాల్గొంటారు. ఉదయం 11:30 నిమిషాలకు రాహుల్ విజయవాడ నుంచి హెలికాప్టర్ ద్వారా మణుగూరుకు చేరుకుంటారు. పినపాకలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి వరంగల్ జిల్లా నర్సంపేటకు చేరుకుని బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3:00 గంటలకు నర్సంపేట నుంచి వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చేరుకుంటారు. పార్టీ శ్రేణులతో కలిసి నగరంలో పాదయాత్రలో పాల్గొని, అనంతరం సమావేశంలో ప్రజలనుద్దేశించి మాట్లాడతారు.