సూర్యాపేటలో కేసీఆర్ మీడియాతో మాట్లాడుతుండగా పవర్ కట్

-

ఇవాళ ఎండిపోయిన పంట పొలాల పరిశీలన చేశారు మాజీ సీఎం కేసీఆర్. ప్రస్తుతం సూర్యపేటకు చేరుకొని అక్కడ మీడియాతో ప్రసంగిస్తున్నారు. కేసీఆర్ మీడియాతో ప్రసంగిస్తున్న సమయంలోనే పవర్ కట్ కావడం గమనార్హం. దీంతో కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇలాంటి పవర్ కట్ ఉంటుందని చెప్పారు. ఇలాగే పోతూ వస్తూ ఉంటుందని సెటైర్లు వేశారు. తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిరంతరం విద్యుత్ ఇచ్చామని తెలిపారు. అద్భుతమైన వ్యవస్థ ఉన్నా ఇలా ఎందుకు జరుగుతుందో తనకు తెలియడం లేదన్నారు.

చాలా చోట్ల రైతులు కన్నీరుమున్నీరు అయి మమ్ముల్ని ఆదుకోవాలి. మేము పెట్టుబడి పెట్టి నష్టపోయాం.. మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి మాకు న్యాయం చేయాలని విలపించారు. నీళ్లు ఇస్తామని చెబితే పంటలు వేసుకున్నాం. ఈ ప్రభుత్వం మాటలు విని నష్టపోయామని రైతులు పేర్కొంటున్నారు కేసీఆర్. తెలంగాణలో చాలా చోట్ల మోటార్లు కాలిపోతున్నాయి. అద్భుతంగా ఉన్న విద్యుత్ వ్యవస్థ ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయిందని ప్రశ్నించారు కేసీఆర్. 

 బీఆర్ఎస్ హయాంలో  రైతులకు నీరు సరఫరా చేయడం, రైతుకు పెట్టుబడి ఇవ్వడం,24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా, రైతుల పంటలు 7,600 పై చిలుకు కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి ప్రభుత్వం, రైతు బీమా ఏర్పాటు చేయడం వ్యవసాయ రంగం అద్భుతమైన దశకు చేరుకుంది. రాజకీయాలు చేసే తీరిక ఉంది.. కానీ రైతుబంధు వేసే తీరికలేదన్నారు కేసీఆర్. 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version