తెలంగాణలో భారీ వర్షాలు… విద్యుత్‌ శాఖ నంబర్లు ఇవే

-

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ శ్రీ జి రఘుమా రెడ్డి సంస్థ పరిధిలోని చీఫ్ జనరల్ మేనేజర్, సుపెరింటెండింగ్ ఇంజినీర్లతో ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా వర్షాలు పడేటప్పడు సాధారణ ప్రజలు, విద్యుత్ వినియోగదారులు క్రింద సూచించిన స్వీయ జాగ్రత్తలు పాటించాలని సీఎండీ కోరారు. వర్షాలు పడేటప్పుడు స్టే వైర్, విద్యుత్ లైన్ల క్రింద, ట్రాన్సఫార్మర్ల వద్ద నిలబడరాదు.

వీలైనంతవరకు వాటికి దూరంగా ఉండాలి. పశువులను, పెంపుడు జంతువులను కూడా విద్యుత్ పరికరాల నుండి దూరంగా ఉంచాలన్నారు. ఎక్కడైనా రోడ్ మీద, నీటిలో కాని విద్యుత్ తీగ పడి వున్న యెడల ఆ తీగను తొక్కడం గాని, వాటి మీద నుండి వాహనాలు నడపడం చేయరాదు. ఒక వేళ ఎక్కడైనా తెగిపడ్డట్టు ఉంటే వెంటనే సమీప విద్యుత్ సిబ్బందికి గాని, కింద ఇవ్వబడ్డ నెంబర్ల ద్వారా సంస్థ దృష్టికి తీసుకు రాగలరని కోరారు సీఎండి శ్రీ జి రఘుమా రెడ్డి. చెట్ల కొమ్మలపై, వాహనాలపై, ఇతర భవనాలపై తెగి పడ్డ తీగలు ఉన్నట్లయితే వెంటనే సంస్థ దృష్టికి తీసుకురావాలి… భారీ గాలులు, వర్షం పడేటప్పుడు విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే విద్యుత్ పరికరాలను ఆఫ్ చేసి వెంటనే కంట్రోల్ రూమ్ కి తెలియజేయగలరు వెల్లడించారు.

విద్యుత్ అంతరాయం ఫిర్యాదుల నమోదు కోసం కంట్రోల్ రూమ్ కు సంప్రదించే వినియోగదారులు తమ బిల్లు పై ముద్రితమైన USC నెంబర్ ను సిద్ధంగా వుంచుకోగలరు. లోతట్టు ప్రాంతాల్లో, అపార్ట్మెంట్ సెల్లార్ లలో నీళ్ళు చేరితే వెంటనే తమకు తెలియజేయాలని… విద్యుత్ కి సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి వున్నా 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106,7382071574 నకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగలరు. దీనికి తోడు సంస్థ మొబైల్ ఆప్, వెబ్సైట్, ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా కూడా విద్యుత్ సంబంధిత సమస్యలు తమ దృష్టికి తీసుకురాగలరన్నారు సీఎండీ శ్రీ జి రఘుమా రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version