ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణిత్ రావు ఫోన్ టాపింగ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నట్టు సమాచారం. మరోసారి పనికి రాకుండా హార్డ్ డిస్క్ ను మొత్తం పగులగొట్టి అడవిలో వేసినట్టు తెలుస్తోంది. ఇతనికి సహకరించిన వారందరికీ ప్రమోషన్స్ కల్పిస్తానని ఎర చూపినట్టు తెలుస్తోంది. ఇతనికీ సహకరించినటువంటి 15 మందిలో ఓ సీఐ కూడా ఉన్నట్టు సమాచారం.
ఇతను సర్వర్లను సిరిసిల్ల, వరంగల్, హైదరాబాద్ ఏర్పాటు చేశాడు. బీఆర్ఎస్ కీతక నేత ఆదేశంతోనే ఈ వ్యవహారానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ప్రమోషన్స్ కోసమే డ్యూటీలో భాగంగానే ప్రణిత్ రావుకు సహకరించామని తెలిపారు 15 మంది సిబ్బంది. ఓ మీడియా సంస్థ యజమాని వద్ద సర్వర్లు పెట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మూడో రోజు బంజారహిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రశ్నించారు. విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇతనికీ సహకరించిన వారికి కూడా నోటీసులను అందజేసినట్టు సమాచారం. వికారాబాద్ ఫారెస్ట్ లో హార్డ్ డిస్క్ కోసం వెతుకుతున్నారు. హార్డ్ డిస్క్ లభిస్తే.. ఇంకా పూర్తి సమాచారం తెలిసే అవకాశముంది. ఇతని వెనుక ఉన్న బీఆర్ఎస్ కీలక నేత ఎవరు..? మీడియా సంస్థ ఏది అనేది త్వరలోనే వెలుగులోకి రానుంది.