తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దేవాదాయ శాఖ పరిధిలోకి భాగ్యలక్ష్మి ఆలయాన్ని తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. పాతబస్తీలో చార్మినార్‌ను ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మీ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి రానుంది. ఈ మేరకు ట్రిబ్యునల్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆలయానికి తక్షణమే ఈవోను నియమించాలని దేవాదాయశాఖ కమిషనర్‌ను ఆదేశించింది.
ఆలయ నిధులను ప్రస్తుత నిర్వాహకులు దుర్వినియోగం చేస్తున్నట్టు ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖకు అప్పగించాలని తీర్పు ఇచ్చినట్టు దేవాదాయశాఖ అధికార వర్గాల సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.