తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, మెదక్, నిజామాబా ద్ పరిధి లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో… ఓటుకు భారీగానే పంచుతున్నారట.
డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామని ఓటర్లు కూడా భీష్మించుకొని కూర్చోవడంతో… ఓటుకు 5000 వరకు ఇస్తున్నారట. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు 70 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు 90 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వచ్చే నెల 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.