భవిష్యత్ తెలంగాణ అభివృద్ధి పై రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంటేషన్.. అర్వింద్ పనగారియా కీలక వ్యాఖ్యలు

-

తెలంగాణలోని ప్రజా భవన్ లో 16వ ఆర్థిక సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలు అభిప్రాయాలను, వినతులను తీసుకున్నాం. లోకల్ బాడి అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి వినతులను తీసుకున్నాం. డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధుల పై ప్రభుత్వం నుంచి వినతి ఇచ్చారు. దేశ వ్యాప్తంగా పర్యటన కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఆరోవ రాష్ట్రం. భవిష్యత్ తెలంగాణ అభివృద్ధి పై రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంటేషన్ ఇచ్చింది.కమిషన్ సంతృతి చెందింది.

అర్బన్ డెవలప్మెంట్ లో తెలంగాణ అభివృద్ధి బాగా జరుగుతోంది. కేంద్రం నుంచి రాష్ట్ర వాటా నిధుల కేటాయింపు పెంపు పై దృష్టి సారించాలని కోరారు.  15వ ఆర్థిక సంఘం సూచనల మేరకు 41శాతం కేంద్రం కేటాయింపులు చేసింది. కమిషన్ ఇచ్చే సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. నిధుల కేటాయింపు విషయంలో కేంద్రం ఆలోచన విధానాన్ని మేము ప్రశ్నించలేము. అర్బన్ డెవలప్మెంట్ పై తెలంగాణ పోకస్ చేయడం అభినందనీయం. దీంతో పాటు గ్రామీణాభివృద్ధి పై కూడా పోకస్ చేశారు. రాష్ట్రంలో ఆర్ధికాభివృద్ధి, అప్పులపై ప్రజెంటేషన్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version