ఈ నెల 29న రాష్ట్రానికి రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్

రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్ ఈ నెల 29న తెలంగాణ రాష్ట్ర రాజ‌ధానికి రానున్నారు. శీత‌కాల విడిది కోసం రాష్ట్రప‌తి హైద‌రాబాద్ న‌గ‌రానికి రానున్నారు. డిసెంబ‌ర్ 29 నుంచి జ‌న‌వ‌రి నెల మూడో తేదీ వ‌ర‌కు రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్ ద‌క్షిణ భార‌త ప‌ర్య‌ట‌న చేయ‌నున్నారు. కాగ ప్ర‌తి ఏడాది శీత‌కాలంలో రాష్ట్రప‌తి హైద‌రాబాద్ కు రావ‌డం అనేది ఒక సంప్ర‌దాయం. బొల్లారంలో ఉన్న రాష్ట్రప‌తి నిల‌యం లో రాష్ట్రప‌తి మ్ నాథ్ కోవిండ్ బ‌స చేస్తారు.

కాగ చివ‌రి ఏడాది క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణం గా రాష్ట్రప‌తి శీత‌కాల విడిది కోసం రాలేక‌పోయారు. అయితే ఈ నెల 29 నుంచి రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్ ద‌క్షిణాది ప‌ర్య‌ట‌న ఉంటుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్ ప‌ర్య‌ట‌న కు సంబంధించిన ఏర్పాట్ల‌ను పూర్తి చేస్తుంది. కాగ రాష్ట్రప‌తి గా రామ్ నాథ్ కోవింద్ కు ఇదే చివ‌రి ద‌క్షిణాది శీత‌కాల ప‌ర్య‌ట‌న కానుంది. వ‌చ్చే ఏడాది జూలై లో రామ్ నాథ్ కోవింద్ ప‌ద‌వీ కాలం ముగియ‌నుంది.