సిద్దిపేటకు రైలు ఇచ్చిన ఘనత ప్రధాని మోడీదే : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

-

సిద్దిపేట కి రైలు ఇచ్చిన ఘనత ప్రధాన మోడీదే అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి అనే పదానికి కవల పిల్లలు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టిఆర్ఎస్ కి ఓటేసినట్టే అన్నారు. కేసీఆర్ రాహుల్ గాంధీ తెలంగాణ గల్లీలో కొట్లాడుతారన్నారు. ఢిల్లీలో కలిసి అలాయి బలాయ్ చేసుకొని చీకటి ఒప్పందాలు చేసుకుంటారు. పేటీకి రైలు ఇచ్చిన ఘనత ప్రధాన మోడీది అన్నారు. దళిత బంధు పథకంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు 30 శాతం కమిషన్ తీసుకుంటున్నారని స్వయంగా సీఎం కేసీఆరే చెప్పారని తెలిపారు. కేసీఆర్ ని ఓడించండి బిజెపిని గెలిపించండి అని కోరారు. నీళ్లు, నిధులు, నియమాకం కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు కి అడ్డగోలుగా వ్యయం పెంచి పూర్తి చేశారన్నారు. అయినా 60 శాతం భూములకు నీళ్లు అందడం లేదని మండిపడ్డారు.

నియామకాల విషయంలో తెలంగాణ యువతకి అన్యాయం చేసి తన కుటుంబంలో మాత్రమే అందరికీ ఉద్యోగాలు ఇచ్చారన్నారు. సీఎం కేసీఆర్ చెప్పింది ఒకటి చేసేది మరొకటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎక్కడ పేదలకు ఇవ్వలేదన్నారు. ప్రధాని మోడీ ఆవాస్ యోజన పథకం కింద పేదలకు ఇల్లు కట్టించారన్నారు. టిఎస్పిఎస్సి పేపర్ లీకులతో యువత జీవితాలను చీకట్లో పడేశారన్నారు. సిద్దిపేట కరీంనగర్ వరంగల్ పట్టణాలను స్మార్ట్ సిటీలుగా చేసేందుకు మోడీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిందన్నారు టెక్స్టైల్ పార్కు ఇస్తామని కేసీఆర్ ఇవ్వలేదని ప్రధాని మోడీ మంజూరు చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన అనేక కుంభకోణాల్లో కేసీఆర్ వస్తా ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version