కాంగ్రెస్ చేసిన ద్రోహాలను తెలుసుకుని రాహుల్ మాట్లాడితే బాగుంటుంది : కవిత

-

శుక్రవారం నాడు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అర్బన్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. తెలంగాణతో ఆ పార్టీకి ఎన్నికల బంధం తప్పితే మరేమీ లేదని ఆమె అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణకు పేగు బంధం ఉందని చెప్పారు. తెలంగాణ ప్రజలు పేగు బంధాన్నే ఆదరిస్తారని అన్నారు. నిజామాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న వారిపై 1969లో ఇందిరాగాంధీ ప్రభుత్వం కాల్పులు జరిపిందని మండిపడ్డారు.

1969లో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన వారిపై ఇందిరాగాంధీ కాల్పులు జరిపిస్తే 369 మంది అమరులయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉమ్మడి రాష్ట్ర సీఎం అంజయ్యను హైదరాబాద్ విమానాశ్రయంలో రాజీవ్ గాంధీ అవమానించి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. 2009లో సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నామని ప్రకటించి వెనక్కి వెళ్లడం కారణంగా వందలాది మంది అమరులయ్యారు’’ అని కవిత ధ్వజమెత్తారు. కాంగ్రెస్ చేసిన ద్రోహాలను తెలుసుకుని రాహుల్ మాట్లాడితే బాగుంటుందని అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version