ఏపీలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనుండగా, పొత్తు కార్యాచరణను ముందుకు తీసుకెళ్లేందుకు టీడీపీ-జనసేన నిర్ణయించాయి. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ నెల 23న రాజమండ్రిలో సమావేశం కానున్నారు. లోకేశ్, పవన్ కల్యాణ్ అధ్యక్షతన టీడీపీ-జనసేన జేఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల దిశగా ఉమ్మడి కార్యాచరణ, ఇరు పార్టీల మధ్య సమన్వయం కుదర్చడం తదితర అంశాలపై ఈ కీలక భేటీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
రాజకీయ కార్యక్రమాల జోరు పెంచేలా తగిన ప్రణాళికలు సిద్ధం చేయడంపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాగా, పొత్తు సమన్వయం కోసం టీడీపీ, జనసేన ఇప్పటికే జేఏసీ సభ్యులను ప్రకటించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు విడుదలయ్యాక.. పొత్తులపై మరింత క్లారిటీ రానుంది. అలాగే సీట్ల పంపకాలు, జగన్‌ను ఎలా ఎదుర్కోవాలి అన్న దానిపై వ్యూహాలు రచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేపత పవన్ కల్యాణ్‌లు ఈ నెల 23న రాజమండ్రిలో సమావేశం నిర్వహించనున్నారు. వీరిద్దరి అధ్యక్షతన టీడీపీ – జనసేన జేఏసీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.