ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నేపథ్యంలో… ఎమ్మెల్సీ కవిత షాకింగ్ పోస్ట్ చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా నివాళులర్పించారు ఎమ్మెల్సీ కవిత. వలస పాలకుల చెరలో బందీ అయిన తెలంగాణ తల్లి విముక్తి కోసం ప్రొ.జయశంకర్ తిరగని ప్రాంతం లేదని చెప్పారు.

సమస్త వనరుల సిరుల మాగాణమైన తెలంగాణ యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని అనుక్షణం పరితపించారని వెల్లడించారు ఎమ్మెల్సీ కవిత. మలి దశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కు మార్గదర్శిగా ఆయన చేసిన కృషి సదా స్మరణీయం అన్నారు కవిత.