ఆర్టీసీ బస్సు ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ఢీ కొట్టింది. చీరాల-కారంచేడు రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. 30 మంది ప్రయాణికులతో చీరాల నుంచి నరసరావుపేట వెళ్తున్న పల్లె వెలుగు బస్సును ఢీకొట్టిన హైదరాబాద్ నుంచి చీరాల వెళుతోంది ట్రావెల్స్ బస్సు.

రహదారికి పక్కనే ఉన్న కొమ్మమూరు కాలువలోకి దూసుకెల్లింది ఆర్టీసీ బస్సు. ఆర్టీసీ బస్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. నిద్రమత్తులో రాంగ్ రూట్లో ప్రైవేటు బస్సు డ్రైవర్ రావడంతోనే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు పోలీసులు.