మృతదేహంలో క‌రోనా.. అమెరికా ప‌రిశోధ‌న‌ల్లో తేలిన నిజాలివే…!

-

మృత‌దేహంతో క‌రోనా సోకుతుందా ? అన్న ప్ర‌శ్న ఇప్పుడు ప్ర‌పంచంలో కోట్లాది మంది మెద‌ళ్ల‌ను తొలిచి వేస్తోంది. ఇక క‌రోనా మృత‌దేహాల‌కు అంత్య క్రియ‌లు కూడా నిర్వ‌హించ‌లేని ప‌రిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. కొన్ని చోట్ల ప్ర‌జ‌లే క‌రోనా మృత‌దేహాల‌ను ఖ‌న‌నం చేయ‌కుండా అడ్డుకుంటున్నారు. మ‌రి కొన్ని చోట్ల క‌రోనా మృత‌దేహాల‌ను గ్రామాల్లోకి కూడా రానివ్వ‌డం లేదు. మ‌రి కొన్ని చోట్ల క‌రోనా మృత‌దేహాల‌ను ప్ర‌భుత్వానికి అప్ప‌గిస్తే వారే ఖ‌న‌నం చేస్తోన్న ప‌రిస్థితి. క‌రోనాతో మ‌ర‌ణించిన వారి మృత‌దేహాన్ని గ్రామాల్లోకి రానించినా… ఆ మృత‌దేహాన్ని గ్రామ స్మ‌శానంలో ఖ‌న‌నం చేయించినా త‌మ‌కు కూడా క‌రోనా సోకుతుంద‌న్న ఆందోళ‌న‌లో చాలా మంది ఉన్నారు.

ఇప్పుడు ఈ సందేహం ప్ర‌పంచ వ్యాప్తంగానే చాలా మందికి ఉంది. దీనిపై లేనిపోని అపోహ‌లు కూడా రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. అయితే దీనిపై ఇప్ప‌టికే ప‌లు ప‌రిశోధ‌న‌లు కూడా జ‌రుగుతున్నాయి. తాజాగా వెలువ‌డిన ఓ అధ్య‌య‌నం మాత్రం ఈ విష‌యంలో పుకార్ల‌కు చెక్ పెట్టేసింది. మృతదేహాలతో కరోనా వ్యాపించదని, ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని షికాగోలోని ఇల్లినాయిస్‌ విశ్వవిద్యాలయ అంటువ్యాధుల వైద్య నిపుణుడు డాక్టర్‌ విజయ్‌ ఎల్దండి చెప్పారు.

క‌రోనాతో చ‌నిపోయిన వారి మృత‌దేహాల‌పై ఆయ‌న కొద్ది రోజులుగా ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. మృత‌దేహాల నుంచి క‌రోనా సోకుతుంద‌న్న ఆందోళ‌న‌లు వ‌ద్ద‌ని.. వీటితో వైర‌స్ సోక‌ద‌ని… అయితే వీటిని ఖ‌న‌నం చేసేట‌ప్పుడు మాత్రం జాగ్ర‌త్త‌లు పాటిస్తే చాల‌ని చెప్పారు. త‌న ప‌రిశోధ‌న అంశాల‌ను ఓ నివేదిక‌లో పొంద‌రుప‌రిచిన ఆయ‌న కరోనా మరణించిన వారి మృతదేహాలపై ప్రజల తీరు సరికాదని చెపుతూనే.. ఆ నివేదిక‌ను తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌తో పాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌కు అందజేశారు. ఇదే అంశంపై వినోద్‌కుమార్ సైతం మాట్లాడుతూ క‌రోనా మృత‌దేహాల‌ను ద‌హ‌నం చేయ‌కుండా అడ్డుకోవ‌డం స‌రికాద‌న్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version