ఓడినప్పుడు కుంగిపోకూడదు, గెలిచినపుడు పొంగిపోకూడదని పేర్కొన్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఇవాళ సంతాప సభలో మాజీ మంత్రి అజయ్ మాట్లాడుతూ..ఓటమికి ఎవరిని నిందించడానికి లేదు…ఓడినపుడు కుంగిపోకూడదు,గెలిచినపుడు పొంగిపోకూడదన్నారు. పోయినసారి ఇదే ఫలితాలు వచ్చాయి…కాకపోతే అపుడు ఖమ్మం గెలిచాం, ఇపుడు భద్రాచలం గెలిచామన్నారు.
కాకపోతే అపుడు ప్రభుత్వం ఉంది ఇప్పుడు లేదని వివరించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న రేవంత్ రెడ్డి కి శుభాకాంక్షలు చెప్పారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ప్రజలు,కార్యకర్తలు అధైర్యపడొద్దని కోరారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఎల్లా వేళలా అండగా ఉంటామని.. కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడితే ఇక్కడున్న నాయకులం అందరం వారికి అండగా ఉండి పరిష్కరిస్తామని తెలిపారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. కాగా.. ఖమ్మం నియోజక వర్గంలో తుమ్మల నాగేశ్వర రావు చేతిలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఓడిపో యారు.