ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ ని విడుదల చేయాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు బెయిల్ మంజూరు అయింది. దీంతో ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ.. ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని తాను హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్నానని తెలిపారు. నమ్మదగిన సాక్ష్యాలు లేకుండా, ఆరోపించిన నేర ఆదాయాన్ని రీకవరి చేయకుండా కేవలం ఆమోదిత అనే పిలవబడే వారి ప్రకటనల ఆధారంగా, అంచనాల ఆధారంగా పౌరులను అరెస్ట్ చేయడం రాష్ట్ర అపహరణ మరియు భారత ప్రభుత్వం చేసిన రాజకీయ ప్రతీకార చర్య తప్ప మరొకటి కాదన్నారు.
పూర్తిగా ఇది చట్ట విరుద్దం. 2002లో జరిగిన గోద్రా మారణహోమంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి పాత్రను బయటపెట్టి సత్యం వైపు నిలబడి జైలులో మగ్గుతున్నటువంటి ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ ని విడుదల చేయాలని తాను కూడా సుప్రీంకోర్టును అభ్యర్థించినట్టు వెల్లడించారు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్.