గణేష్ ఉత్సవాలకు సంబంధించి పోలీస్, ఫైర్, హెల్త్, GHMC కి సంభందించిన సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మంత్రి శ్రీధర్ బాబు హాజరై మాట్లాడారు. ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవం ఎంతో ముఖ్యమైనది. వారు గతం లో ఎదురుకున్నా చిన్న చిన్న ఇబ్బందులను మా దృష్టికి తెచ్చారు. వాటిని పునరావృతం కాకుండా చూడాలని అధికారులను అదేశించామని తెలిపారు.
ముఖ్యంగా ట్రాఫిక్, కరెంట్ ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. అందరినీ కలుపుకొని ఈ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించాం. అందరు కూడా సహకరించి ముందుకు వెళ్తామని వారు తెలియజేశారు. పొల్యూషన్ నీ దృష్టిలో పెట్టుకుని మట్టి విగ్రహాలు పెట్టేలా ప్రోత్సహించాలని నిర్ణయించాం. అందరికీ మట్టి విగ్రహాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించాం. మట్టి విగ్రహాల ఉపయోగం పై పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయాలని నిర్ణయించాం. మట్టి విగ్రహాలు వినియోగించి సహకరించాలని ప్రజలని విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు.