గాల్లో కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై కేసు పెట్టాలి – రఘునందన్‌రావు

-

మహబూబ్ నగర్ లో నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో భాగంగా తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గాలిలో కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఇష్యూపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రీడమ్ ర్యాలీలో గాల్లో కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌పై కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు.

మంత్రి హోదాలో ఉండి బహిరంగ కాల్పులు జరిపారు.. ఆయన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇంత వరకు ఆ గన్‌ను ఎందుకు సీజ్ చేయలేదు? అని నిలదీశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు. ప్రైవేట్‌ వ్యక్తులకు గన్‌ ఇచ్చే అధికారం ఎవరు ఇచ్చారని మండిపడ్డారు.

ఇది ఇలా ఉండగా.. వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయాలనుకోవడం మంచిది కాదని.. కొందరు మాకు ఉన్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక ఇలా చేస్తున్నారని ఆగ్రహించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. స్పోర్ట్స్ ఈవెంట్ లో స్పోర్ట్స్ మినిస్టర్ గా చేయమంటే చేసాను …దీంట్లో ఏమి లేదన్నారు. అల్ ఇండియా రైఫెల్ అసోసియేషన్ లో నేను మెంబెర్ అని.. అన్ని రూల్స్ నాకు తెలుసని వెల్లడించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version