తెలంగాణ రాష్ట్రంలో ర్యాగింగ్ కలకలం రేపింది. నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. మద్యం తాగి మెడికల్ కాలేజీలో చదువుతున్న కేరళ విద్యార్థులను ర్యాగింగ్ చేశారు సీనియర్ విద్యార్థులు. తాము చెప్పిన పనులు చేయాలంటూ వేధించి ర్యాగింగ్ కు పాల్పడ్డారని కాలేజీ ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారట. దీంతో ముగ్గురు వైద్య విద్యార్థులను, ఒక జూనియర్ డాక్టర్ను సస్పెండ్ చేసినట్టు కాలేజీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక అటు ఖమ్మంలో దారుణం చోటుచేసుకుంది…విద్యార్థికి గుండు కొట్టించాడు ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలోని మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్వాకం బయటపడింది. ఫస్టియర్ విద్యార్థికి గుండు చేయించారు అసిస్టెంట్ ప్రొఫెసర్. విద్యార్థి జుట్టు సరిగా కట్ చేయించుకోలేదని గుండు చేయించారు ప్రొఫెసర్. క్రమశిక్షణ పేరుతో ఈ చర్య చేశారు అసిస్టెంట్ ప్రొఫెసర్.