కర్ణాటక రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. బళ్లారి పట్టణానికి 15 కిమీ దూరంలో ఉన్న బొమ్మనహాల్ మండలం చంద్రగిరిలో బీజేపీ కార్యకర్త కృష్ణమూర్తి శెట్టిని రాములు అనే వ్యక్తి వేటకొడవలితో అతి కిరాతకంగా నరికి చంపాడు. వీరిద్దరి మధ్య ఇదివరకే భూతగాదాలు ఉన్నట్లు సమాచారం.ఈ హత్యకు అదే కారణమని అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

బీజేపీ కార్యకర్త హత్యతో చంద్రగిరి ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. స్థానిక ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మర్డర్ గురించి సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టు మార్టం అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.ఈ ఘటనపై స్టేట్ బీజేపీ నేతలు ఒక్కసారిగా సీరియస్ అయ్యారు.