కుల గణన లెక్క తేలాకే సంక్షేమ కార్యక్రమాలు సరిగా అందుతాయి: రాహుల్‌ గాంధీ

-

ఓబీసీలకు అండగా నిలిచేందుకు మోదీ, కేసీఆర్‌ సిద్ధంగా లేరని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దేశాన్ని నడిపించే ఉన్నతాధికారుల్లో 90 శాతం అగ్రవర్ణాలవారే ఉన్నారని తెలిపారు. బడ్జెట్‌లో ఓబీసీలకు ఎంత ఖర్చు చేస్తున్నారో ఆలోచించాలన్న రాహుల్.. దేశంలో, రాష్ట్రంలో ఓబీసీలు 50 శాతం వరకు ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా కుల గణన చేపడతామని వెల్లడించారు. రోగనిర్ధారణ తర్వాతే రోగికి చికిత్స చేయాలనే విషయం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మరిచాయని.. కుల గణన లెక్క తేలాకే సంక్షేమ కార్యక్రమాలు సరిగా అందుతాయన్న విషయం కూడా వారికి తెలియడం లేదని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామని… దొరల కోసం కాదని తేల్చి చెప్పారు. జీవన్‌రెడ్డి, లక్ష్మణ్‌కుమార్‌ను శాసనసభకు పంపే బాధ్యత ప్రజలదేనని రాహుల్ వ్యాఖ్యానించారు.

‘రాష్ట్రం మొత్తం ఒక కుటుంబం చేతుల్లోకి వెళ్లింది. ఇక్కడ ఉన్న ఏకైక చక్కెర ఫ్యాక్టరీని మూసివేస్తారు. మాప్రభుత్వం ఏర్పడ్డాక ఫ్యాక్టరీ తెరిచి చక్కెర రైతులను ప్రోత్సహిస్తాం. ఇక్కడి పసుపు క్వింటాలుకు 12000 మద్దతు ధర కల్పిస్తాం. మీకు నాకు ఉన్నది రాజకీయ సంబంధం కాదు.. ప్రేమాభిమానాలతో కూడిన బంధం. ఈ బంధం ఈ నాటిది కాదు.. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చెల్లెను ఆహ్వానించాను. నేను మళ్లీ పర్యటిస్తానని అన్నారు.. ఈ బంధం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ నుంచి కొనసాగుతోంది. దిల్లీలో బీఆర్​ఎస్ బీజేపీకి మద్దతు ఇస్తోంది.. ఇక్కడ ఎంఐఎం బీఆర్​ఎస్​కు మద్దతు ఇస్తోంది. నేను బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాను. అందుకే నా మీద ఎన్నో కేసులు పెట్టడమే కాకుండా నా ఇల్లు సభ్యత్వాన్ని లాక్కున్నారు.’ అని రాహుల్ గాంధీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version