హైదరాబాద్లో మళ్లీ వాన కురుస్తోంది. ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. వానలో తడుస్తూనే తమ పనుల మీద వెళ్తున్నారు. నగరంలో ముఖ్యంగా కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, హిమాయత్ నగర్, నారాయణ గూడ తదితర ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్లోని పలు ప్రాంతాల్లో వాన వల్ల స్థానికులు అవస్థలు పడుతున్నారు. రైల్వే స్టేషన్ చిలకలగూడ ప్యాట్నీ ప్యారడైజ్ బేగంపేట్ మారేడుపల్లి ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఒక్కసారిగా రహదారులు అనే జలమయం కాగా డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.
ఉదయాన్నే వర్షం కురవడంతో వాహనదారులు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వానలో తడుస్తూనే పాఠశాలలకు వెళ్తున్నారు. ఇక కార్యాలయాలకు వెళ్లే వారు కూడా తడిసిముద్దవుతున్నారు. వాన వల్ల పలు ప్రాంతాల్లో రహదారులపైకి నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వరద పోటెత్తితే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు చేపట్టారు.