బ్రేకింగ్ : తెలంగాణ మంత్రి కేటీఆర్ పై రాజ్ గోపాల్ రెడ్డి పరువు నష్టం దావా వేసేందుకు రెడీ అయ్యారట. ఈ విషయాన్ని వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి కంపెనీలపైన కేటీఆర్ ఆరోపణలు సరికాదు.. కేసీఆర్ ప్రభుత్వం కమీషన్ల కోసం ఎక్కువ ధరకు ప్రాజెక్టులు(తాడిచేర్ల కోల్ మైన్) కట్టబెట్టిందని తెలిపారు.
ఎక్కువ ధరలకు కేటాయించడం వల్ల 29వేల కోట్లు జెన్ కో,రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా 4 కాంట్రాక్టులు రాజ్ గోపాల్ రెడ్డికి దక్కాయని తెలిపారు వివేక్ వెంకటస్వామి. బిజెపి ప్రభుత్వం వల్ల రాలేదు.. కేటీఆర్ గ్రహించాలి.. తప్పుడు ఆరోపణలపై విచారణకు సిద్ధమని పేర్కొన్నారు.
బిజెపి మునుగోడులో గెలుస్తుందనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. కేటీఆర్ పై రాజ్ గోపాల్ రెడ్డి పరువు నష్టం దావా వేస్తానన్నారని వెల్లడించారు. TRS ఓడిపోతుందనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిపి 86 మంది ని బూత్ స్థాయిలో బాధ్యతలు అప్పగించారు.. సోమవారం నామినేషన్ దాఖలు కోసం రిటర్నింగ్ అధికారిని సమయం ఆడిగామన్నారు. సోమవారం రాజ్ గోపాల్ రెడ్డి నామినేషన్ వేస్తారు.. ర్యాలీ , సభ ఉంటుందన్నారు. సంజయ్, తరుణ్ చుగ్ హాజరు అవుతారు.. రేపు మునుగోడు కు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ వస్తున్నారని చెప్పారు వివేక్ వెంకటస్వామి.