బీజేపీలో చేరే వారికి రాజాసింగ్ హెచ్చరించారు. పార్టీలో చేరే ముందు కొన్ని మాటలు యాదిలో పెట్టుకోండి.. మరికొన్ని రాసి కూడా పెట్టుకోండి అని పేర్కొన్నారట. బీజేపీలో వచ్చే ముందు కొందరితో చర్చించి, ఆ తర్వాత చేరండి… నాగం జనార్దన్ రెడ్డి, విజయశాంతి, జితేందర్ రెడ్డి ఎందుకు బీజేపీలో చేరి, మళ్ళీ వెళ్లిపోయారో ఆలోచించండి అని వెల్లడించారు.

బీజేపీలో చేరాక మీరు అనుకున్నది మీ నియోజకవర్గంలో జరగదు…. మీతో పాటు చేరిన కార్యకర్తలకు మీరు ఏ పదవి ఇప్పించలేరని స్పష్టం చేశారు రాజాసింగ్. మీకే టికెట్ వస్తుందన్న గ్యారెంటీ ఉండదు… మొదట్లో ఫస్ట్ సీట్లో ఉంటారు.. మెల్లగా లాస్ట్ సీట్లోకి తోసేస్తారని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ బీజేపీలో కొంతమంది రాక్షసులు ఉన్నారు.. ఈరోజు కాకపోతే రేపైనా ఆ రాక్షసులు నాశనం అవుతారు అని హెచ్చరించారు రాజాసింగ్.