కేసీఆర్ పాలనే బాగుందని అంటున్నారు – కాంగ్రెస్ ఎమ్మెల్యే

-

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రూపకల్పన తీరు సరిగా లేదంటూ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి..కేసీఆర్‌ పాలన బాగుందని జనాలు అంటున్నట్లు తెలిపారు. 365 రోజుల్లో 20 రోజులు ఉపాధి హామీ చేసిన వారికి ఆత్మీయ భరోసా ఇస్తారట .. ఏ లెక్కన ఇస్తున్నారో నాకు అర్థమైతలేదని ఆగ్రహించారు. తాజాగా మునుగోడు నియోజక వర్గంలో MLA కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పథకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

rajgopal reddy comments Over KCR

గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారు.. కేసీఆర్‌ను మెచ్చుకుంటున్నారని తెలిపారు. రైతు బంధు మధ్యలో ఒకసారి ఎగ్గొట్టినమంటూ బాంబ్‌ పేల్చారు. రైతు భరోసాలో ఇచ్చిన హామీ మేరకు కాకుండా, కొంత నగదును తగ్గించామంటూ తప్పు ఒప్పుకున్నారు. అందుకే గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారు.. ఎన్ని అప్పులు చేసి అయినా పథకాలు అమలు చేస్తామని ప్రకటించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. ముఖ్యంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రూపకల్పన తీరు సరిగా లేదంటూ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. ఈ వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version