ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై రూల్స్ సరిగా లేవు అంటూ MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తాజాగా మునుగోడు నియోజక వర్గంలో MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పథకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారు.. కేసీఆర్‌ను మెచ్చుకుంటున్నారని తెలిపారు. రైతు బంధు మధ్యలో ఒకసారి ఎగ్గొట్టినమంటూ బాంబ్ పేల్చారు.
రైతు భరోసాలో ఇచ్చిన హామీ మేరకు కాకుండా, కొంత నగదును తగ్గించామంటూ తప్పు ఒప్పుకున్నారు. అందుకే గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారు.. ఎన్ని అప్పులు చేసి అయినా పథకాలు అమలు చేస్తామని ప్రకటించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ముఖ్యంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రూపకల్పన తీరు సరిగా లేదంటూ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రూపకల్పన తీరు సరిగా లేదంటూ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి pic.twitter.com/iYGdbJghx4
— Telugu Scribe (@TeluguScribe) January 26, 2025