Rakesh Reddy : బీఆర్‌ఎస్‌ లో చేరనున్న రాకేష్‌రెడ్డి ?

-

 

Rakesh Reddy : బిజెపి పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. బీఆర్‌ఎస్‌ లో చేరనున్నారు రాకేష్‌ రెడ్డి. బిజెపి పార్టీకి రాజీనామా చేసిన రాకేష్ రెడ్డిని బిఆర్ఎస్ నేత కడియం శ్రీహరి కలిసారు. వరంగల్ లోని రాకేష్ ఇంటికి వెళ్లి బిఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ‘నిబద్ధతతో పనిచేసే వ్యక్తి రాకేష్ రెడ్డి. యూఎస్ లో ఉద్యోగాన్ని వదులుకొని బిజెపికి ఎనలేని సేవ చేశారు.

Rahul Gandhi to Madigadda today

టికెట్ రాకపోవడంతో మనస్థాపం చెందిన ఆయనను కలిసి నా సంఘీభావం ప్రకటించా. అలాగే కేసీఆర్ నాయకత్వంలో కలిసి పని చేద్దామని ఆహ్వానించా’ అని కడియం తెలిపారు. ఇక బిజెపి పార్టీకి రాజీనామా చేసిన రాకేష్ రెడ్డిని బిఆర్ఎస్ నేత కడియం శ్రీహరి కలవడంతో… కచ్చితంగా బీఆర్‌ఎస్‌ లో రాకేష్‌రెడ్డి చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా.. వరంగల్ వెస్ట్ బీజేపీ టికెట్ రాకపోవడంతో భావోద్వేగానికి గురై, కంటతడి పెట్టిన రాకేశ్ రెడ్డి..బీజేపీకి రాజీనామా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version