Rahul Gandhi to Madigadda : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. అక్టోబర్ 21న ఆనకట్ట పియర్స్, వంతెన కుంగడంతో రాహుల్ వాటిని పరిశీలించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఉదయం 11 గంటల మధ్య సందర్శనకు ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇచ్చింది. రాహుల్ ఆ బ్యారేజీ పరిశీలన తర్వాత మధ్యాహ్నం ఒంటిగంటకు అయిటిపల్లిలో సభ నిర్వహించనున్నారు.
ఇది ఇలా ఉండగా.. అన్నారం బ్యారేజిపై మీడియాలో, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అన్నారం బ్యారేజ్ కి సంబంధించిన ఎగ్జిక్యుటివ్ ఇంజినీర్ ఏ. యాదగిరి మీడియాకు వివరాలను వెల్లడించారు. ముఖ్యంగా ఈ బ్యారేజ్ కి బ్యారేజ్ కు ఎలాంటి ప్రమాదం లేదు. అన్నారం బ్యారేజ్ కు ఢోకా లేదన్నారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు రూమర్లు నమ్మవద్దు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ప్రతి సంవత్సరం సహజంగా ఓ అండ్ ఎంటెక్ అప్డేట్ చేస్తాం.1275 మీటర్స్ లెంగ్త్ లో రెండు చోట్ల సీపేజ్ ఉంది. కానీ, ఎక్కడ కూడా ఇసుక రావడం లేదని తెలిపారు.