అధికార లాంఛనాలతో రామ్ నారాయణ్ అగర్వాల్ అంత్యక్రియలు

-

అగ్ని క్షిపణి పితామహుడు, ప్రముఖ డీఆర్డీఓ శాస్త్రవేత్త డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ ఆగస్టు 15న మరణించారు.  వీరి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హైదరాబాద్ లో ఆగస్టు 17న శనివారం  వీరి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరుగనున్నాయని ఉత్తర్వులు జారీ చేశారు.

రక్షణ రంగంలో డా. అగర్వాల్ చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 1990 లో పద్మశ్రీ, 2000 లో పద్మ భూషణ్ అవార్డులను ప్రకటించింది. డా. ఆర్.ఎం.అగర్వాల్ 1983 లో భారత ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మక భారత మిస్సైల్ కార్యక్రమంలో డా. అరుణాచలం, డా. ఏ.పీ.జె. అబ్దుల్ కలాంతో కలసి పనిచేశారు. హైదరాబాద్ లో అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబరేటరీ వ్యవస్థాపక డైరెక్టర్ గా అగర్వాల్ పనిచేసారు. 2005 లో డిఫెన్స్ రీసర్చ్, డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ లో విశిష్ట శాస్త్ర వేత్తగా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ తర్వాత డా. రామ్ నారాయణ్ అగర్వాల్ హైదరాబాద్ లో నివాసం ఏర్పరచుకొని చివరి క్షణం వరకు రక్షణ రంగానికి సేవలందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version