భద్రాద్రి రామాలయ భూముల్లో ఆగని ఆక్రమణలు

-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామాలయ భూముల్లో ఆక్రమణలు ఆగటం లేదు. రామాలయానికి భూములపై అన్ని అనుమతులు ఉన్నప్పటికీ అక్రమ కట్టడాలను కడుతున్నారు ఆక్రమణదారులు. ఆపటానికి వెళ్ళిన ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎల్ రమాదేవి గారిపై అలాగే సిబ్బందిపై దాడికి దిగారు ఆక్రమణదారులు. ఆలయ ఈవో పై సిబ్బంది పై కర్రలతో దాడి చేసారు.

1970 నుండి 2022 వరకు మరియు 2022 లో దేవస్థానంకు అనుకూలంగా ఫ్రెష్ గా a.p హైకోర్టు వారి ఉత్తర్వులు n250 వరకు.. అలాగే వివిధ కోర్టులు అనగా లోకల్, జిల్లా, ఎండోమెంట్ ట్రిబ్యునల్, సెటిల్మెంట్ కోర్టులు, ఆంద్ర ప్రదేశ్, తెలంగాణ హైకోర్టులు అన్నింటిలో దేవస్థానంకు అనుకూలంగా భూముల విషయంలో ఉత్తర్వులు ఉన్నాయి. అయిన ఇప్పటికీ ఆగలేదు అక్రమ నిర్మాణాలు. అనేక మార్లు దేవస్థాన సిబ్బంది పై ఆక్రమణ దారులు దాడి చేసారు. అయితే ఈ విషయంలో దేవస్ధానం అధికారులు అలాగే రాష్ట్రీయ వానరసేన కంటెంప్ట్ కేసు దాఖలు చేసినా ఆక్రమ నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version