ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు..!

-

ప్రభుత్వాస్పత్రుల్లో ఆడిటింగ్ నిర్వహిస్తాం. శానిటేషన్, ఆస్పత్రుల నిర్వహణ, ఎక్విప్మెంట్, డయాలసిస్ కేెంద్రాలు వంటి వాటిపై ఆడిటింగ్ చేపడతాం అని మంత్రి సత్యకుమార్ అన్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల మెరుగైన పని తీరు కోసం 30 అంశాల కార్యాచరణ ప్రణాళిక చేపడుతున్నాం. ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో సానుకూల వాతావరణం భావ‌న కల్పించేందుకు చర్యలు చేపడతాం. సరైన నిర్వహణ, పారిశుధ్యం, అవాంతరాలు లేని ఓపీ సేవలు, హాజరుపై దృష్టి పెట్టాలి అని అధికారులకు సూచించారు.

వైద్యులు, రోగనిర్ధారణ పరికరాలు, యంత్రాల పని తీరును పర్యవేక్షిస్తాం. అన్ని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రులలో అందుబాటులో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలి. అన్ని ఆసుపత్రుల్లో అధునాతన శస్త్ర చికిత్సలు, అవయవ మార్పిడి చికిత్సలు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. మెరుగైన ఆరోగ్య సేవలను అందించేందుకు స్వల్ప, మధ్య , దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళిక రుపొందిస్తున్నాము. ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య మంత్రిత్వ శాఖ పాత 11 అనుబంధ బోధన ఆస్పత్రులతోపాటు కొత్త వాటితో సహా అన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల నిర్వ‌హ‌ణ‌, ఆరోగ్య సంరక్షణ సేవల నాణ్య‌త మ‌రియు పని తీరులో మార్పు కోసం ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది అని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version