రేవంత్, ఈటల నా తమ్ముళ్లు అంటూ విజయశాంతి పోస్ట్

-

రేవంత్, ఈటల నా తమ్ముళ్లు అంటూ విజయశాంతి పోస్ట్ చేశారు. దేశంలోనే అత్యంత ధన ప్రభావిత ఎన్నికల కార్యాచరణ తెలంగాణలో కొనసాగుతున్నది. మన తెలంగాణ రాజకీయ కార్యకర్తలందరూ గత తొమ్మిది సంవత్సరాలుగా చూస్తున్న వాస్తవమిదన్నారు.

 

 

ఇందుకు కారణంగా ఉన్న అసలైన దుర్మార్గ వ్యవస్థపై పోరాడవలసిన కర్తవ్యం మనకు తప్పనిసరిగా ఉన్నదనేది నిజం. ఈ విధానాన్ని అధికారపార్టీ ప్రజాస్వామ్య హనన రాజకీయ దుష్కృత్య ధోరణులపై కాక, ప్రతిపక్షాల నేతలు పరస్పరం చేసుకునే మాటల, సవాళ్ల దాడులు, బీఆరెస్‌కు వేడుకలవుతున్నాయి. బీఆరెస్‌తో పోరాడే తమ్ముళ్లు రేవంత్ గారు, ఈటలగారు తమ దాడిని ఒకరిపై ఒకరు కాకండా ఎవరి ధోరణిలో వారు ప్రభుత్వంపై పోరాడటం అవసరమేమో…అంటూ చురకలు అంటించారు.

 

ఈ సందర్భంలో కొంచెం ఆలోచించాలని తెలంగాణ ప్రస్తుత పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న ఇద్దరికీ… నిరంతర తెలంగాణ ఉద్యమకారిణిగా ప్రజల అభిప్రాయం చెప్పడం ఈ సందర్భంలో నా బాధ్యత అనిపించింది అని వెళ్ళందించారు విజయశాంతి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version