PSLV-C55 : నేడు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సి55

-

తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నుంచి ఇవాళ మధ్యాహ్నం 2.20 గంటలకు పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌(పీఎస్‌ఎల్‌వీ)-సి55 ప్రయోగం చేపట్టేందుకు శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్‌ డౌన్‌ ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 25.30 గంటల పాటు కొనసాగిన తర్వాత పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. సింగపూర్‌కు చెందిన 741 కిలోల బరువుగల టెలీయోస్‌-2, 16 కిలోల లూమోలైట్‌-4 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ మోసుకెళ్లనుంది.

టెలీయోస్‌-2 ఉపగ్రహం సింగపూర్‌ ప్రభుత్వానికి చెందినది. ఎస్టీ ఇంజినీరింగ్‌ భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. ఉపగ్రహంలో సింథటిక్‌  ఎపర్చరు రాడార్‌ పేలోడ్‌ను ఉంచారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లో రేయింబవళ్లు కవరేజీ అందించగలదు. లూమాలైట్‌-4 ఉపగ్రహాన్ని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇన్ఫోకామ్‌ రీసెర్చ్‌, నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌లోని శాటిలైట్‌ టెక్నాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు. సింగపూర్‌ ఇ-నావిగేషన్‌ సముద్ర భద్రతను పెంపొందించడం, ప్రపంచ షిప్పింగ్‌ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చడం దీని లక్ష్యం.

Read more RELATED
Recommended to you

Exit mobile version