నీకు దమ్ముంటే నాపై పోటీ చెయ్ : రేవంత్ కు రంజిత్ రెడ్డి సవాల్

-

తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డికి టిఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే తనపై పోటీ చేసి రేవంత్ రెడ్డి గెలవాలని చాలెంజ్ చేశారు ఎంపీ రంజిత్ రెడ్డి. వ్యక్తిగత విమర్శలు మానుకో రేవంత్ రెడ్డి..అని హెచ్చరించారు ఎంపి రంజిత్ రెడ్డి. చాత నైతే ప్రాజెక్టులకు జాతీయ హోదా కోసం పార్లమెంట్ లో మాతో పాటు కొట్లాడాలని.. చురకలు అంటించారు.

వరి కొనుగోలు కోసం కేంద్రంతో ఎంపీలం పోరాటం చేస్తే మాతో పాటు పోరాటం చెయ్యడానికి రావడానికి చాతకాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపి రంజిత్ రెడ్డి. నేను వ్యాపారిని… గుడ్ల వ్యాపారం చేస్తే తప్పా ? ప్రజా సేవా చేద్దం అనుకున్న చేస్తున్నానని వెల్లడించారు.

నీకు చేత నైతే చేవెళ్ల నుంచి పోటీ చేద్దం రా… నువ్వానేనా చూసుకుందాం రా అంటూ సవాల్ చేశారు ఎంపి రంజిత్ రెడ్డి. వ్యక్తి గత విమర్శలు మానుకో, మేము డిగ్నిటీ మేంటనేస్ చేస్తున్నామన్నారు ఎంపి రంజిత్ రెడ్డి. టిఆర్ఎస్ పార్టీ పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version