HYD: హైదరాబాద్‌ లో విషాదం.. ర్యాపిడో డ్రైవర్ హత్య

-

HYD: హైదరాబాద్‌ లో విషాదం చోటు చేసుకుంది. ర్యాపిడో డ్రైవర్ హత్యకు గురయ్యాడు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హైదరాబాద్‌ లో వరుసగా హత్య కేసులు జరుగుతూనే ఉన్నాయి. అయితే.. తాజాగా మరో హత్య హైదరాబాద్‌ లో జరిగింది. హైదరాబాద్‌ లో ర్యాపిడో డ్రైవర్ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

rapido bike driver died in hyderabad

హైదరాబాద్‌ లోని… బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి రోడ్ నంబర్ 12 NBTనగర్‌లో గత మంగళవారం రోజున ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. మృతుడు మహమ్మద్ ఖాజా పాషా (ర్యాపిడో డ్రైవర్) అని తెలుస్తోంది. అయితే అతడికి తన స్నేహితుడు పర్శతో ఘర్షణ జరగగా.. ఈ ఘటనలో పాషాపై.. పర్శ కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ నేపథ్యంలో పాషా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version