అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ ప్రచారం సాగుతోంది. డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికల బరి నుంచి బైడెన్ తప్పుకున్న తర్వాత ఆ స్థానంలో కమలా హ్యారిస్ పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కమలా హ్యారిస్ను లక్ష్యంగా చేసుకుని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పిస్తున్నారు. అమెరికాను పాలించే అర్హత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు లేదని ఆయన అన్నారు.
కమల ‘తీవ్రమైన వామపక్ష ఉన్మాది అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించిన ట్రంప్.. మూడున్నర సంవత్సరాలుగా బైడెన్ ప్రతీ వైఫల్యం వెనక ఆమె ఉన్నారని విమర్శించారు. కమలా అధికారంలోకి వచ్చే అవకాశం ఇస్తే అమెరికాను సర్వనాశనం చేస్తారని తీవ్ర ఆరోపణలు చేశారు ట్రంప్. కానీ, దాన్ని చాను జరగనివ్వబోనని.. తానెప్పుడూ సక్రమంగానే ఉంటానని అన్నారు. ఇలాంటి ప్రమాదకరమైన వ్యక్తులతో పోటీపడాల్సి వస్తే ఏం చేయగలను? అలా ఉండడం కుదరదని వ్యాఖ్యానించారు. తన ప్రసంగంలో కమలా హారిస్ పేరును ట్రంప్ దాదాపు 45 సార్లు ప్రస్తావించారు.