రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదు : సీఎం రేవంత్ రెడ్డి

-

రైతు రుణమాఫీ  చేసేందుకు  రేషన్ కార్డు ప్రామాణికం కాదు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు రుణమాఫీ 2024 నిధుల విడుదల కార్యక్రమంలో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. భూమి ఉండి, బ్యాంకులో పాస్ బుక్ పెట్టి లోన్ తీసుకున్న ప్రతీ రైతుకు రుణమాఫీ వర్తిస్తుందని తెలిపారు. రేషన్ కార్డు తప్పనిసరి అని కొందరూ అపోహలు సృష్టిస్తున్నారని.. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తొలి విడుతలో ఇవాళ 6,098 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

నా జీవితంలో ఇది మరుపురాని రోజు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రతీ నెల రూ.7వేల కోట్లు వడ్డీలు కడుతున్నారు. నాలుగు కోట్ల తెలంగాణ రైతుల ఆకాంక్షను నెరవేర్చారు సోనియాగాంధీ. ఈనెల చివరి వరకు రాహుల్ గాంధీతో వరంగల్ లో పెద్ద ఎత్తున సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు జరుపుకుంటున్నారు రైతులు.  ఇవాళ 11లక్షల 50వేల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version