కృత్రిమ మేధ వినియోగంపై 20 ఏళ్ళ రోడ్ మ్యాప్ రూపొందించాలి: మంత్రి శ్రీధర్ బాబు

-

 

కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీల్లో బ్రిటిష్ హై కమిషన్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ (E&Y) సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వాములు అవడం పట్ల ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేసారు. గురువారం నాడు బ్రిటిష్ హై కమిషన్, ఇ&వై ప్రతినిధులతో ఆయన సచివాలయంలో బేటీ అయ్యారు.

Sridhar Babu’s sensational decision against those who encroached on government lands

గ్లోబల్ సామర్థ్య కేం ద్రాలను ఏర్పాటు చేయడంలో సహకరించాలని ఈ సందర్భంగా ఆయన వారిని కోరారు. వచ్చే 20 ఏళ్లకు సంబందించి ప్రభుత్వ పాలన, పారిశ్రామిక రంగాల్లో కృత్రిమ మేధ వినియోగంపై ఒక రోడ్ మ్యాప్ ను రూపొందించాలని ఆయన సూచించారు. తెలంగాణా ప్రభుత్వం 200 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఏఐ సిటీలో బ్రిటిష్ హై కమిషన్, ఎర్నెస్ట్ సంస్థలు కీలక భాగస్వాములు కావాలని శ్రీధర్ బాబు అభిలషించారు. సైబర్ సెక్యూరిటీలో శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి హై కమిషన్ ముందుకు రావడం అభినందనీయమని మంత్రి కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version