RTCలో 3 వేల నియామకాలు చేపడతాం – మంత్రి పొన్నం

-

RTCలో 3 వేల నియామకాలు చేపడతామని ప్రకటించారు మంత్రి పొన్నం. హనుమకొండ హయగ్రీవ గ్రౌండ్ లో ఆర్టీసీ 50 ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. వరంగల్ కి 112ఎలక్ట్రిక్ బస్సుల కేటాయించారు. ఇక మొదటి దశగా ఈ రోజు 50 ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ. సంక్రాంతి లోపు మరో 25 బస్సులు రోడ్డెక్కనున్నాయి.. అనంతరం మిగిలిన బస్సులు రోడ్డు ఎక్కుతాయి. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… జిల్లాకు మొత్తం 112 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించగ ఈరొజు 50 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించుకుంటున్నామని తెలిపారు.

Recruitment for 3 thousand posts in RTC

అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని… ఇప్పటి వరకు 125 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు.. మహిళలు 4350 కోట్ల రూపాయల విలువైన ప్రయాణం ఉచితంగా చేశారన్నారు. అక్యుపేన్సి గతంలో కంటే రెట్టింపు అయింది.. ఆర్టీసీ ఉద్యోగుల వల్లే సాధ్యం అవుతుంది వారు నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. తెలంగాణ కోసం కోట్లడిన ఆర్టీసీ ఉద్యోగులు బస్ కా పెయ్య నై చెలిగ అనే ఉద్యమాన్ని చేపట్టారన్నారు. వారికి 2013 బాండ్స్ ఇచ్చాం.. 21 శాతం పీఆర్సీ ఇచ్చామని… ఆర్టీసీ లో కారుణ్య నియామకాలు చేపట్టామని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version